- ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై ప్రత్యేక దృష్టి
- రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు
- 9 కంపెనీలకు ఆమోదముద్ర
- 2,63,411 మందికి ఉద్యోగ అవకాశాలు
- 2028 నాటికి పూర్తయ్యేలా చర్యలు
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. రాష్ట్రంలోని కొలువుదీరిన కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధితో పాటు యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి.
కాగా, ఈరోజు సచివాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏపీకి రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు రానున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అనంతరం 9 కంపెనీల ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు ఆమోదముద్ర వేశారు.
ఈ ప్రాజెక్టులన్నీ 2028 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వీటి ద్వారా దాదాపు 2,63,411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. 2028 నాటికి ఈ ప్రాజెక్టులన్నీ నపూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.