సినిమాల్లో హీరోలు గుర్రపు స్వారీ చేయడం చూశాం.. కొదమ సింహంలో చిరంజీవి, మగధీరలో రాంచరణ్.. ఇంకా చాలామంది హీరోలు గుర్రపు స్వారీ చేశారు. ఇక టక్కరిదొంగలో అయితే మహేశ్ బాబు హార్స్ రైడింగ్ చూసి జనాలు మస్త్ ఎంజాయ్ చేశారు.. వారి ఎంట్రీ సన్నివేశాన్ని ఎన్నిసార్లు చూసినప్పటికీ కూడా ప్రేక్షకులు ఇప్పటికీ మైమరిచి పోతుంటారు.. అయితే.. నిండా ఏడేళ్లు కూడా నిండని ఓ బుడ్డోడు.. అదే స్టైల్లో గుర్రంపై స్వారీ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. గుర్రాలను చూస్తే జడుసుకునే ఏజ్‌లోనే ‘‘కమాన్రా బాద్షా’’ అంటూ గుర్రంపై దౌడు తీస్తున్నాడు. ఇది చూసిన జనం వావ్ అంటూ నోరెళ్లబెట్టి చూస్తూ సంబ్రమాశ్యర్యాలకు గురవుతున్నారు.
అయితే.. ఈ చిన్నోడు ఎవరో తెలిస్తే మీరు షాక్ అవక తప్పదు.. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ జెఈవో డాక్టర్ బి. లక్ష్మీకాంతం, శోభాలతల ముద్దుల మనవడు ఈ బుడ్డోడు. తమిళనాడు రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా సేవలందిస్తున్న వీరరాఘవ రావు, హాసంతికాల గారాల తనయుడు. నిండా ఏడు ఏళ్లు కూడా లేని విష్ణుజిత్ గుర్రపు స్వారీలో అందరినీ ఆశ్యర్యపోయేలా చేస్తున్నాడు. చూసేవారి అభినందనలు సొంతం చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా పలువురు మాస్టర్ విఘ్ణజిత్ భవిష్యత్తులో మరిన్ని గుర్రపు స్వారీ పోటీలలో పాల్గొని కీర్తి ప్రతిష్టలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.