Saturday, November 23, 2024

విశాఖకు కార్యాలయాల తరలింపుపై కమిటీ

అమరావతి, ఆంధ్రప్రభ: దసరా నుంచి విశాఖ రాజధానిగా పరిపాలన సాగించనున్నట్లు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వెల్లడించిన నేపద్యంలో కార్యాలయాల తరలింపుపై మంత్రులు, అధికారులతో కమిటీ వేయనున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ముగిసే సమయానికి కమిటీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కమిటీలో సీనియర్‌ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్ర నాథ్‌ రెడ్డి వుండవచ్చని తెలుస్తోంది.

అలాగే సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు కమిటీ-లో వుండే అవకాశం వుంది. అసెంబ్లీ సమావేశాల అనంతరం కమిటీ విశాఖపట్నం సందర్శించి సీఎంకు సంభందించి ఏర్పాటు చేసే ప్రధాన కార్యాలయాలకు అనువైన ప్రభుత్వ, ప్రవేటు భవనాలను పరిశీలించి ముఖ్యమంత్రికి నివేదిక అందిస్తారు. మంత్రుల కమిటీ నివేదికను పరిశీలించిన అనంతరం సీఎం జగన్‌ నిర్ణయం తీసుకోనున్నారు. కాగా విశాఖ ఋషి కొండలో సీఎం క్యాంపు కార్యాలయం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement