Friday, November 22, 2024

Breaking: సినిమా టికెట్ల వ్యవహారంపై కమిటీ సమావేశం

సినిమా టికెట్ల వ్యవహారంపై సచివాలయంలో ప్రభుత్వ కమిటీ సమావేశం అయింది. సభ్యుల సూచనలపై ఇవాళ మరోసారి కమిటీ చర్చించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా టికెట్ రేట్ల సవరణ చేసే అవకాశం ఉంది. గత నెలలో ఒకసారి సమావేశమైన కమిటీ.. బీ, సీ సెంటర్లలో టికెట్ రేట్లు పెంచాలని గత సమావేశంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కోరారు.

ఏపీలో సినిమా టికెట్ల ధరల వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 35ను జారీ చేసింది. దీంతో పలు థియేటర్లు మూతపడ్డాయి. ప్రభుత్వ జీవో రేట్లతో థియేటర్లు నడపలేమని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

మరోవైపు ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హై కోర్టు.. ప్రభుత్వ జీవోను రద్దు చేసింది. దీంతో హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సింగిల్ డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. దీంతో హై కోర్టులో సినిమా టికెట్ల ధరలపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం సినీ ప్రముఖుల విజ్ఞప్తి మేరకు సినిమా టికెట్ రేట్ల కమిటీ ఏర్పాటు చేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement