( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : జమిలి ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాద్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఈ బిల్లు వచ్చే అవకాశం లేదన్న ఆయన 2029 లోనే జెమినీ ఎన్నికలు జరిగే అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించినట్లు గుర్తు చేశారు.
విజయవాడలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో డ్రోన్ పంపిణీ కార్యక్రమానికి ఆదివారం హాజరైన విలేకరులతో మాట్లాడుతూ జమిలి ఎన్నికలు నేటి పరిస్థితుల్లో ముఖ్యమని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గించడంతోపాటు, అన్ని విధాలుగా జమిలి ఎన్నికలు తోడ్పడుతాయి అన్నారు.
అయితే ప్రస్తుతం పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందవలసింది ఉందన్న ఆయన ప్రస్తుత సమావేశాలలో ప్రస్తావన లేదన్నారు. ఇప్పటికే జెమినీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టమైన ప్రకటన చేశారని గుర్తు చేసిన ఆయన ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తామంతా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.