( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రామచంద్ర మోహన్ శనివారం జగన్మాతను దర్శించుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి పై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి శనివారం వచ్చిన ఆయనకు డిప్యూటీ ఈవో రత్నరాజు, ఇతర ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రామచంద్రకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాన్ని అందజేశారు.
మంత్రితో మర్యాదపూర్వక భేటీ…
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని తాడేపల్లిలో రామచంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి ఆయన పుష్పగుచ్చాలిచ్చారు. నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రకు ఈ సందర్భంగా ఆనం శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
- Advertisement -