Thursday, November 21, 2024

అనధికార నల్లా కనెక్షన్ల తొలగించండి

మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని  అభివృద్ధి పనులపై అడిషనల్ కమీషనర్ హేమమాలిని రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో అనధికార నల్లా కనెక్షన్లు గుర్తించి తీసివేయాలని ఆదేశించారు. వార్డుల నందు తిరిగి నీటి పన్నులు వసూలు పూర్తి చేయాలన్నారు.  కొత్త నల్లా కనెక్షన్ల అప్లికేషన్లు పెండింగ్ లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రజలు నీటి కనెక్షన్ల విషయములో ఎటువంటి సమస్యలు వచ్చినా అధికారులు పరిష్కరించలన్నారు. స్ట్రీట్ లైట్స్  సమస్యలను పర్యవేక్షించాలని అడిషనల్ కమీషనర్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement