ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సీఎం నారాయణ స్వామి ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన తిరుపతికి వచ్చిన సందర్భంగా సినిమా టికెట్ల ధరలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ… సినిమా కూడా వారసత్వం అయిపోయిందని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రతిభ ఉన్న వారికి అవకాశం రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. సినిమా రంగంలో ఉన్న వారు జీఎస్టీ (GST) సరిగ్గా కట్టడం లేదని, నష్టపోతున్న నిర్మాతలను ఆదుకోవడం లేదని ఆరోపించారు. ఈ నిర్మాతల కోసం మరో 2, 3 సినిమాలు ఫ్రీగా చేయడం లేదన్నారు. టికెట్ ధర రూ.2 వేలు, రూ. 3వేలు అమ్మడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పేదవారు కూడా సినిమా చూడాలి కదా…సినిమా టికెట్ల ధరలపై కమిటీ వేశామన్నారు.
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల రగడ ఇంకా కంటిన్యూ అవుతోంది. టికెట్ల విషయంలో సినిమా రంగంలోని పలువురు నటులు తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital