అమరావతి, ఆంధ్రప్రభ: ఒడిశాలోని భువనేశ్వర్‌లో తిరుమల తిరుపతి దేవస్ధానం(టీటీడీ) కొత్తగా నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానించారు. విజయవాడ రాజ్ భవన్‌లో సోమవారం గవర్నర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 26న ఉదయం విగ్రహ ప్రతిష్ఠా మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
21వ తేదీ నుండి విగ్రహ ప్రతిష్ఠా పూజా కార్యక్రమాలు ప్రారంభం కానుండగా, మిథున లగ్నంలో నిర్వహించే స్వామి వారి ప్రాణ పతిష్టకు విచ్చేయాలని గవర్నర్‌ను కోరారు. సానుకూలంగా స్పందించిన గవర్నర్ మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నారంటూ టీటీడీ ఛైర్మన్‌ను అభినందించారు. కార్యక్రమంలో రాజ్ భవన్ అధికారులు బీసీ బెహర, పీవీ నరసింహన్ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..