Sunday, September 8, 2024

AP | చర్చిద్దాం రండి.. ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం

ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో 104 ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఫిబ్రవరి 12న మధ్యాహ్నం 3.30 గంటలకు సచివాలయానికి రావాలని పిలుపునిచ్చింది. ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ నేపథ్యంలో, ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై చర్చించాలని మంత్రుల బృందం నిర్ణయించింది.

ప్రభుత్వం తమకు రూ.6,700 కోట్లు బకాయిలు పడిందని, గత నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నాలుగు డీఏలు, సరెండర్ లీవులు, పదవీ విరమణ బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement