Friday, November 22, 2024

రంకెలేసిన కోడెగిత్తలు, కాలు దువ్విన యువకులు.. మాంభేడులో పశువుల పండగ జోష్‌..

వెదురుకుప్పం, (ప్రభన్యూస్) : చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలో కోడెగిత్త‌లు రంకెలేశాయి. వాటి జోరుకు త‌గ్గ‌ట్టు యువ‌కులు కాలుదువ్వి పోటీలో పాల్గొన్నారు. మాంబేడులో జ‌రిగిన ప‌శువుల పండుగలో ఫుల్‌ జోష్ నెల‌కొంది. వెదురు కుప్పం మండలం మాంభేడులో సంక్రాంతి సంబరాల్లో భాగంగా పశువుల పండు జ‌రిగింది. వేల సంఖ్యలో జ‌నం త‌ర‌లివ‌చ్చి చూశారు. మాంభేడుతో పాటు దాని పరిసర గ్రామాల నుంచి పశువులను ఉదయం తోలుకొచ్చారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ త‌ర్వాత‌ ఎద్దులకు , ఆవులకు, దూడలకు, కొమ్ములు చెరిగి, రంగులు వేశారు.

రాజకీయ నాయకులు, సినీ నటులు, దేవుళ్ల‌ ఫోటోలు, రంగు కాగితాలు అంటించిన చెక్క పలకలతో పాటు, నగదు, దుస్తులు, విలువైన వస్తు సామాగ్రిని కట్టారు. ఉదయం నుంచి ఈ సంద‌డి కొన‌సాగింది. అల్లి అవతల నిలబడి జోరుగా వచ్చే కోడి గిత్తలను ఆపేందుకు యువ‌కులు పోటీపడ్డారు. పశువుల కొమ్ములకు తగిలించిన చెక్క పలకలను వస్త్ర సామాగ్రిని సొంతం చేసుకునేందుకు ట్రై చేశారు.. పలకలను చేజిక్కించుకోవడంలో యువకుల మధ్య కొంత ఘర్షణ నెలకొంది. వాటిని ఆపే క్రమంలో కింద పడి గాయాల‌య్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement