Wednesday, January 15, 2025

Collegium Recomanded – తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు ఆరుగురు కొత్త జడ్జీలు

న్యూఢిల్లీ : తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టుల‌కు జ‌డ్జిలుగా ప‌లువురి పేర్ల‌ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార‌సు చేసింది. తెలంగాణ హైకోర్టుకు న‌లుగురు, ఏపీ హైకోర్టుకు ఇద్ద‌రి పేర్ల‌ను సిఫార‌సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. తెలంగాణ హైకోర్టుకు వై రేణుక‌, నందికొండ న‌ర్సింగ‌రావు, తిరుమ‌ల దేవి, మ‌ధుసూద‌న్ రావు, ఏపీ హైకోర్టుకు హ‌రిహ‌ర‌నాథ శ‌ర్మ‌, య‌డ‌వ‌ల్లి ల‌క్ష్మ‌ణ‌రావు పేర్ల‌ను సిఫార‌సు చేసింది. జ్యుడిషియ‌ల్ ఆఫీస‌ర్ల కోటాలో ఈ ఆరుగురు పేర్ల‌ను కొలీజియం సిఫార‌సు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement