పిఠాపురం – ఏపీలో సంక్రాంతికి ముందే కోళ్లు కత్తులు దూస్తున్నాయి. పొంగల్‌కి రెండు వారాల ముందే పందెం రాయుళ్లు కాయ్ రాజా కాయ్ అంటున్నారు. బరులు గీసి బస్తీ మే సవాల్ అంటున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోనూ కోడి పందాలు షురూ అయ్యాయ్. నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద ఉత్తున చేరుకున్న అభిమానుల మధ్య పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ 13 రోజులు ముందే పిఠాపురంలో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. కోడి పందాలకు పచ్చజెండా ఊపారు. కత్తులు కట్టని కోడిపుంజులను దువ్వి మరీ బరిలోకి దింపారు వర్మ. పందెంలో అలసిపోయిన కోడిపుంజుకు నోటితో నీళ్లు కొట్టి పందానికి పంపారు. అభిమానుల కేరింతల మధ్య కొద్దిసేపు కోడి పందాలును వీక్షించారు. ఈ సందర్భంగా.. సంప్రదాయాలను కూటమి ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు వర్మ.
సంప్రదాయ పోటీలకు పెద్ద పీట…
పిఠాపురంలో సాంప్రదాయ కోడి పందాలు, ఎడ్ల పందాలు జరుగుతాయని ప్రకటించారు వర్మ. అయితే.. కోడిపుంజులకు కత్తులు కట్టకుండా, హింసించకుండా జరిగే సాంప్రదాయాలను మాత్రమే ప్రోత్సహిస్తామని చెప్పారు. గ్యాంబ్లింగ్ లాంటి జూదాలను ఆడకూడదని పిలుపునిచ్చారు. గ్యాంబ్లింగ్ ఆడడం చట్ట వ్యతిరేకమని స్పష్టం చేశారు