Friday, November 22, 2024

జోరుగా కోడి పందేలు

బాపట్ల టౌన్, (ప్రభ న్యూస్) : సంక్రాంతి పండుగకు ముందే కోడి పందేలు పట్టణ, గ్రామాల శివారులో జోరుగా సాగుతున్నాయి. మండల, పట్టణ ప్రాంతాల్లో పందెం కోళ్లకు ప్రత్యేక శిబిరాలు ఏర్పటు చేసి శిక్షణ ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పందెం రాయుళ్లు ఇప్పటి నుంచే కోడి పందేలు వేస్తూ మూగ జీవాలను హింసిస్తూ వారి సంతోషాన్ని నింపుకుటున్నారు. వందల నుంచి వేల వరుకు బెట్టింగ్ లు కాస్తూ కోడి కాళ్లకు కత్తులు కట్టి మరి పందెంలోకి దించుతున్నారు. ప్రత్యేకంగా పందెం కోళ్లకు శిక్షణ ఇచ్చి విక్రయాలు జరపడంతో పాటు, బెట్టింగులు వేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

బాపట్ల, కార్లపాలెం, పిట్లవానిపాలెం మండలంలో గల గ్రామాల్లో కోడి పందేల రాయుళ్లు అధికారుల కళ్ళు గప్పి పందేలు వేస్తున్నారంటే మాములు విషయం కాదని చెప్పాలి. బహిరంగ ప్రదేశాల్లో వాహనాలపై పందెం కోళ్లు తరిలిస్తూ బాగా పరిచయమున్న వ్యక్తులకు రూ.5వేలు నుంచి రూ.15వేలు వరకు విక్రయాలు జరుపుతున్నారు. వ్యక్తుల సంతోషాల కోసం మూగజీవాలను హింసించడం చట్టరీత్యా నేరమని జంతు ప్రేమికులు వాపోతున్నారు. అధికారులు కోడి పందేలు వేయడం చట్టరీత్యా నేరమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన అధికారుల మాటలను తుంగలో తొక్కి బహిరంగ ప్రదేశాల్లో కోడి కాళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగకు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో బరి కట్టి పందేలు వేసే అవకాశమున్న నేపథ్యంలో పోలీసులు కోడి పందేలు వేసే నిర్వాహకులపై కఠినంగా వ్యవహరించాలని జంతువుల ప్రేమికులు కోరుతున్నారు. ఈ విషయంపై బాపట్ల రూరల్ యస్ఐ వెంకట ప్రసాద్ మాట్లాడుతూ… కోడి పందేలు వేసే వారిపై కేసులు నమోద జైలుకు పంపిస్తామని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement