Friday, September 20, 2024

AP | బీసీ సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష… ప‌లు కీల‌క నిర్ణ‌యాలు !

బీసీ సంక్షేమ శాఖ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మీడియాకు వెల్లడించారు.

బీసీల ఎదుగుదలకు నిధులు కేటాయిస్తూ సీఎం చంద్ర‌బాబు నిర్ణయం తీసుకున్నారని సవిత తెలిపారు. గత ప్రభుత్వంలో ఉన్న రూ.110 కోట్ల డైట్ ఛార్జీల బకాయిల విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే రూ.20.52 కోట్ల కాస్మొటిక్ ఛార్జీల బకాయిల విడుదలకు నిర్ణయం తీసుకున్నామన్నారు. వసతి గృహాల్లో సాధారణ మరమ్మతులకు రూ.10 కోట్లు విడుదల చేయనున్నారు. ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు.

ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం పునరుద్ధరణ చేస్తున్నట్లు చెప్పారు. బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలపై నివేదికలు కోరుతున్నామన్నారు. బీసీ స్టడీ సర్కిళ్ల బలోపేతానికి రూ.10 కోట్లు విడుదల చేస్తామని అన్నారు. కమ్యూనిటీల వారీగా అభివృద్ధి ప్రణాళికలు చేస్తున్నట్లు మంత్రి సవిత వివరించారు. ఏపీలో 5 చోట్ల ఫ్యాకల్టీ డెవలప్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి సవిత తెలిపారు. కాపు భవనాల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి సవిత వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement