Tuesday, December 24, 2024

AP | బీసీ సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష !

సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంపై మంత్రుల కమిటీ సిఫార్సులపై సమీక్షించారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు.

బీసీ సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలు కల్పించాలని, బాలికల హాస్టళ్లను వెంటనే మరమ్మతులు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ సందర్భంగా స్కిల్ ఎడ్యుకేషన్ కోసం 104 బీసీ హాస్టళ్లలో ఎస్ ఆర్ శంకరన్ నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

అర్హులందరికీ పింఛన్లు, పథకాలు అందాలన్నదే తమ ఉద్దేశమని సీఎం చంద్రబాబు అన్నారు. అదే సమయంలో అనర్హులకు ఫించన్లు ఇవ్వడం సరికాదన్నారు. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అని స్పష్టం చేయడానికి, కొన్ని నియమాలను అమలు చేయాలని… పింఛన్లపై పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టి అనర్హులను తొలగించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement