సీఎం వైఎస్ జగన్ విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో తొలుత మరకత రాజరాజేశ్వరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సచ్చిదానంద స్వామితో సమావేశమై, స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
కాగా దత్త పీఠానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. 35 దేశాల్లో దత్తపీఠం శాఖలను ప్రారంభించి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ హిందూ ప్రచారం నిర్వహిస్తున్నారు. భారతదేశంలో మరో 89 శాఖలను ప్రారంభించారు. వీటిద్వారా ప్రతి నిత్యం పేదలకు అన్నదానం, ఉచిత మెడికల్ క్యాంపుల నిర్వహణ చేపడుతున్నారు. మ్యూజిక్ ఫర్ మెడిటేషన్ అండ్ ఫీలింగ్ రాగ సాగర నాద పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మ్యూజిక్ ద్వారా చికిత్సల కోసం అనేక దేశాలలో సంగీత విభావరులు ఏర్పాటు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: India Corona: దేశంలో తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీ రేటు