Tuesday, November 26, 2024

దావోస్‌ కు సీఎం జగన్‌.. తొలి విదేశీ పర్యటన ఇదే!

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌లో(స్విట్జర్లాండ్) పర్యటించనున్నారు. వచ్చే నెల మే 22 తేదీన దావోస్‌కు వెళ్లనున్న సీఎం జగన్.. వారం రోజుల పాటు పర్యటిస్తారు. అంతేకాదు అక్కడ జరగబోయే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొంటారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సీఎం జగన్ తొలి అధికారిక విదేశీ పర్యటన ఇదే. సీఎం అయిన తరువాత లండన్..అమెరికా వెళ్లినా అది పూర్తిగా వ్యక్తిగత పర్యటన గానే పరిమితం అయింది. ఇక, ఇప్పుడు ఏపీకి పెట్టుబడల ఆకర్షించేందుకు దావోస్ కు సీఎం వెళ్లనున్నారు. ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన తరువాత పూర్తిగా సంక్షేమం పథకాల అమలు పైనే దృష్టిపెట్టింది. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల విషయంలో సీఎం జగన్ అడుగు ముందుకు వేయలేదంటూ రాజకీయంగా విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ మూడేళ్ల కాలంలో ఒక్క పెట్టుబడి ఏపీకి రాలేదంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ విదేశీపర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement