Tuesday, November 26, 2024

రేపు భువనేశ్వర్ టూర్ కు సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి రేపు ఒడిశా టూర్ వెళ్లనున్నారు. ఆంధ్రా, ఒడిశాల మధ్య దీర్ఘకాలంగా అపరిశ్కృతంగా ఉన్న అంశాలపై చర్చించేందుకు రేపు భువనేశ్వర్‌ పర్యటనకు వెళుతున్నారు ముఖ్యమంత్రి జగన్‌. భువనేశ్వర్‌లో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో సమావేశమం కానున్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ పెండింగ్ అంశాల‌పై ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రితో జ‌గ‌న్ చర్చించనున్నారు. అలాగే ఒడిశా సీఎంతో ప్రస్థావించాల్సిన అంశాలపై తన క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో జ‌గ‌న్ చర్చించారు.

రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో చర్చించబోతున్నారు. ముఖ్యంగా వంశధార నదిపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల అంశాలు కూడా చర్చకు రానున్నాయి.

రేపు ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలు దేరి శ్రీకాకుళం పాతపట్నం చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు సీఎం జగన్‌. శ్రీకాకుళం పర్యటన అనంతరం విశాఖ ఎయిర్‌పోర్ట్‌ చేరుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు భువనేశ్వర్‌ బయలు దేరనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నివాసానికి చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement