Tuesday, November 26, 2024

వైఎస్‌ఆర్‌ ఆసరా రెండో విడత: మహిళల జీవితాల్లో కాంతులు

రాష్ట్రంలో వైఎస్సార్‌ ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని ఈనెల 7వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. మహిళల సంక్షేమం, స్వావలంబన, సాధికారతే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో వైఎస్‌ఆర్‌ ఆసరా రెండో విడతలో మొత్తం 8.71 లక్షల మహిళా సంఘాలలోని 87.74 లక్షల అక్కచెల్లెమ్మలకు లబ్ది చేకూరేలా రూ. 6,792 కోట్లు నేరుగా మహిళా సంఘాల పొదుపు ఖాతాలలో అక్టోబర్‌ 7 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు జమ చేయడం జరుగుతుంది.

ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుపడి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల ఆర్ధిక పురోగతికి దోహదపడుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మహిళలు ఆర్ధికంగా అభివృద్ది చెంది వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ పథకం తీసుకొచ్చారు.

కరోనా కష్టకాలంలో, రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం వైఎస్‌ఆర్‌ ఆసరా రెండో విడత నిధులు విడుదల చేయనుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలందరినీ రుణ విముక్తుల్ని చేసేందుకు వైఎస్‌ఆర్‌ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్.. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి సుమారు 8.71 లక్షల మహిళా సంఘాలలోని 87,74 లక్షల అక్కచెల్లెమ్మలకు ఉన్న అప్పు నిల్వ రూ. 27,168 కోట్లను 4 విడతలలో చెల్లిస్తానని చెప్పారు. గతేడాది మొదటి విడత రూ. 6,792 కోట్లను మహిళా సంఘాల పొదుపు ఖాతాలలో జమ చేశారు.

మహిళల జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావాలని, వారి కుటుంబంలో సుస్ధిరమైన ఆదాయం రావాలని, వారికి వారుగా సృష్టించుకునే వ్యాపార మరియు జీవనోపాధి అవకాశాలకు ఈ డబ్బును ఉపయోగించుకుని ఆర్ధికంగా అభివృద్ది చెందుతూ లక్షాధికారులు కావాలనే మంచి ఆలోచనతో ఈ పథకాన్ని అమలుచేయడం జరిగింది.

- Advertisement -

మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్లుగా చేయడం కోసం, జీవనోపాధిని మెరుగుపరుచుకునే విధంగా గత ఏడాది అమూల్, హిందూస్తాన్‌ యూనిలివర్, ఐటీసీ, ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబల్, అలానా వంటి వ్యాపార దిగ్గజాలతో, మరియు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంది. నవరత్నాల ద్వారా మహిళలకు నేరుగా ఇప్పటివరకు సుమారు లక్ష కోట్లు లబ్ది చేకూర్చి వారి జీవితాల్లో నిజమైన కాంతులు నింపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement