Monday, November 25, 2024

కర్నూల్ కు సీఎం జగన్..

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు కర్నూలుకు వెళ్తున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడు శివనరసింహారెడ్డి వివాహానికి సీఎం హాజరు కానున్నారు. కర్నూలు మండలం పంచలింగాల సమీపంలోని మాంటిస్సోరి ఒలంపస్ పాఠశాలలో వివాహ వేడుక జరగనుంది. ఉదయం 10.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 11.15 గంటలకు ఆయన కర్నూలులోని ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయల్దేరి 11.35 గంటలకు పంచలింగాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు.

వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అక్కడే 11.55 గంటల వరకు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం 12.15 గంటలకు ఆయన తిరిగి విజయవాడకు బయల్దేరుతారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement