Thursday, November 21, 2024

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా: నేడు కోనసీమ జిల్లాలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ఐ పోలవరం మండలం మురమళ్ళలో నాలుగో ఏడాది వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.45 గంటలకు మురమళ్ళ వేదిక వద్దకు చేరుకుని కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఏడాది వైఎస్సార్‌ మత్స్యకార భరోసా (వేట నిషేధ భృతి) కింద అర్హులైన 1,08,755 కుటుంబాలకు సీఎం రూ.109 కోట్లు జమ చేయనున్నారు. దీంతో పాటు ఓఎన్జీసీ పైపులైన్‌ కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన మరో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మరో రూ.108 కోట్లు జమ చేయనున్నారు. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద గంగపుత్రులకు నాలుగేళ్లలో రూ.418.08 కోట్లు లబ్ధి కలుగుతోంది. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement