Wednesday, November 20, 2024

నిరుద్యోగులకు శుభవార్త… నేడే జాబ్ క్యాలెండర్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంలో ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది.  వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. శాఖల వారీగా ఖాళీల నివేదికను ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్ ఉద్యోగ క్యాలెండర్​ను విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. 

ఉద్యోగాలను గ్రూప్‌ 1, 2, 3, 4 కేటగిరీలుగా విభజన చేసి భర్తీ చేయనున్నారు. ఆర్థిక శాఖ ఆమోదంతో విడతల వారీగా.. ఆయా కొలువుల భర్తీకి ఎపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించనుంది. మొత్తం రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ అన్నీ కలిపి 10 వేల 143 కొలువుల భర్తీకి సన్నద్ధమైన సర్కార్‌… విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందులో జూలైలో 1,238 ఎస్సీ ఎస్టీ డీఏ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్‌ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఆగస్టులో ఏపీపీఎస్సీ ద్వారా 36 పోస్టులకు ప్రకటన జారీ చేస్తామని పేర్కొంది. పోలీస్‌ శాఖలో 450 పోస్టులకు సెప్టెంబరులో 451 వైద్యులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులకు అక్టోబరులో ప్రకటన వస్తుందని తెలిపింది. ఇక నవంబర్‌లో అత్యధికంగా 5,251 మంది పారామెడికల్‌ సిబ్బంది, డిసెంబరులో 441 మంది నర్సుల నియామకానికి ప్రకటన వస్తుందని వెల్లడించింది. ఇక 2022 జనవరిలో 240 డిగ్రీ కాలేజీ లెక్చరర్‌ పోస్టులకు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు సంబంధించి ఫిబ్రవరిలో 2 వేల పోస్టులకు నోటిఫికేషన్‌ వస్తుందని తెలిపింది. మార్చిలో.. వేర్వురు శాఖల ద్వారా మరో 36 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడతామని వెల్లడించింది.

కాగా, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2019 జూన్‌ నుంచి ఇప్పటివరకు భర్తీ చేసిన ఉద్యోగాలు 6,03,756. రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగులు అందరూ కలిపి మొత్తం 6,03,756 మందిని నియమించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: ఏపీలో జులై 26 నుంచి పదో తరగతి పరీక్షలు!

Advertisement

తాజా వార్తలు

Advertisement