కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా రాష్ట్రంలోని 144 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 144 ఆక్సిజన్ ప్లాంట్లను జాతికి అంకితం చేస్తున్నామని తెలిపారు. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ విమానాల్లో తెచ్చుకోవాల్సిన పరిసస్థితి ఏర్పడిందని, ప్రస్తుతం మనమే సొంతంగా ఆక్సిజన్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. 100 పడకలు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లపై 30 శాతం సబ్సిడీ అందిస్తున్నామని సీఎం తెలిపారు. ప్రతి ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ సౌలభ్యం అందిస్తున్నామని చెప్పారు. కోవిడ్ పరిస్థితుల్లోనూ వ్యవసాయం, విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేశామని సీఎం జగన్ గుర్తు చేశారు.
కాగా, రూ. 426 కోట్ల వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.20 కోట్ల వ్యయంతో ఆక్సిజన్ క్రయోజనిక్ కంటైనర్లను కొనుగోలు చేశారు. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా 24,419 బెడ్లకు ఆక్సిజన్ పైప్లైన్లు సౌకర్యం కల్పించనున్నారు. మొత్తం 39 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital