విజయనగరం జిల్లా కురుపాంలోని గురుకులం పాఠశాలలో పాము కాటుకు గురై మృతి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్ధి రంజిత్ కుటుంబానికి ఏపీ సీఎం జగన్ ఆర్ధిక సహాయం ప్రకటించారు. విద్యార్ధి మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. పరిహారంగా రూ. 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం ప్రకటించారు. మంత్రుల ద్వారా నేడు ఆర్థికసాయం అందిస్తామని కలెక్టర్ సూర్యకుమారికి సూచించారు. ఇక పాము కాటుకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థులకు ప్రభుత్వ ఖర్చుతోనే వైద్యం చేయిస్తాని తెలిపారు.
విజయనగరం జిల్లా కురుపాంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు పాముకాటుకు గురైన సంగతి తెలిసిందే. పాము కాటేసిన ముగ్గురు విద్యార్థులలో 8 తరగతి చదువుతున్న రంజిత్‌కుమార్ మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.