Tuesday, November 19, 2024

విద్యుత్‌ చార్జీలపై మాటతప్పిన సీఎం.. 60 శాతం చార్జీల పెంపు దారుణం: క‌ళావెంక‌ట్రావు

అమరావతి, ఆంధ్రప్రభ : విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తానని ప్రమాణ స్వీకార సభలో సిఎం జగన్‌ ప్రకటించి మాటతప్పి, మడమ తిప్పారని టీడీపీ సీనియర్‌ నేత మాజీ మంత్రి కళావెంకట్రావు విమర్శించారు. శుక్రవారం మీడియా విడుదల చేసిన ఒక ప్రకటనలో అధికారంలోకి వచ్చి మూడేళ్ళలోనే రూ.42,872 కోట్ల విద్యుత్‌ భారాల్ని ప్రజలపై మోపారని అన్నారు. 7 సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి రూ. 16,611 కోట్లు-, భారాన్ని వేశారని వెల్లడించారు. ఒకే ధపాలో దాదాపు 60 శాతం కరెంటు- ఛార్జీలు పెంచడం దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారని పేర్కొన్నారు.

రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్‌ ఉత్పత్తి చేసుకునేందుకు ప్లాంట్లు- ఉన్నప్పటికీ వాటిని సక్రమంగా పనిచేయించలేని పరిస్ధితి లో ప్రభుత్వం ఉందని విమర్శించారు. దీంతో రోజుకు రూ.60 కోట్లు- వెచ్చించి బహిరంగ మార్కెట్‌ లో విద్యుత్‌ ను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలను ఉపసంహరించుకోవాలని కళా వెంకట్రావు డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement