Friday, November 22, 2024

AP: రేపు మాచర్లలో సీఎం జగన్‌ పర్యటన..

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (బుధవారం) పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించనున్నారు. అక్కడ వరికపుడిశెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. రేపు ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మాచర్ల చేరుకుంటారు. అక్కడ చెన్నకేశవ కాలనీ ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలి వద్ద ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని, అనంతరం సభలో ప్రసంగించి తిరిగి మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకుంటారు.

పులుల అభయారణ్యం (టైగర్‌ ఫారెస్ట్‌)లో వరికపుడిశెల ఎత్తిపోతల, పైపులైన్‌ పనులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన విజ్ఞప్తికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అంగీకరించింది. దీంతో వరికపుడిశెల ఎత్తిపోతల తొలి దశ పనులను రూ.340.26 కోట్లతో చేపట్టేందుకు మాచర్లలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి.. అధునాతన పైప్డ్‌ ఇరిగేషన్‌(పూర్తిగా పైపులైన్ల ద్వారా) పద్ధతిలో 24,900 ఎకరాలకు నీళ్లందించే దిశగా అడుగులు వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement