వేలేరుపాడు, (ఏలూరు) ప్రభన్యూస్: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట గ్రామంలో ని వరద బాధిత ప్రాంతాల్లో బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించారు. సీఎం పర్యటన వరద బాధితుల్లో ఆత్మ్ధస్యర్యాన్ని నింపింది. గోదావరి వరదలు కారణంగా వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట, తిరుమాలాపురం, నార్లవరం గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఆయా గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి కన్నాయిగుట్ట చేరుకున్నారు. బాధితుల స్ధితిగతులు, యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా అందిన సహాయ సహకారాలను గురించి బాధితులతో ఆయన స్వయంగా మాట్లాడారు.
నిత్యావసరాలు కందిపప్పు, పాలు, 2వేల రూపాయల నగదు అధికారులు అందించారా అని ప్రశ్నించారు. అధికారులు తమను అన్ని రకాలుగా ఆదుకున్నారని సి.యం. కి ప్రజలు చెప్పారు. ప్రాణాలకు తెగించి జిల్లా అధికారులు ఇక్కడే నివాసం ఉన్నారని అన్నారు. నిరంతరాయంగా నిత్యావసరాలు అందించడంతోపాటు- విద్యుత్ సరఫరాలో కూడా అంతరాయం లేకుండా అధికారులు సమన్వయం, సహకారంతో పనిచేశారన్నారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని చూడటంతోనే కడుపు నిండిపోయిందని, మాటలు రావడం లేదని, ఉదయం నుంచి చూసిన ఎదురుచూపులు మర్చిపోయామని చెప్పారు. ప్రభుత్వ పరంగా లభించిన సేవా సహకారం పట్ల ప్రజలు సంతోషం, సంతృప్తి వ్యక్తం చేశారు. వరద అనంతరం కూడా ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం అందుతోందని బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఎవ్వరూ అంధోళన చెందాల్సిన పనిలేదని బాధితులకు సీఎం భరోసా ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.