ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనంతపురం జిల్లా రాయదుర్గం పర్యటిస్తున్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఉదయం విజయవాడ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో 10.25గం.లకు కడప విమానాశ్రయం చేరుకున్న సీఎం జగన్ కు.. జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అప్పటికే అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో అనంతపురం జిల్లా రాయదుర్గంకు వెళ్లారు. ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. కస్టమ్ హైరింగ్ సెంటర్ యూనిట్స్ పరిశీలిస్తారు. రాయదుర్గం మార్కెట్ యార్డులో వైఎస్సార్ ఇంటిగ్రెటెడ్ అగ్రి ల్యాబ్ ప్రారంభించి, లబ్ధిదారులతో మాట్లాడతారు.
మధ్యాహ్నం విద్యార్థి పాఠశాలలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం వైఎస్సార్ జిల్లా పులివెందులలోని ఇంటిగ్రెటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్‌లో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేస్తారు. శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్ చేరుకుంటారు. సాయంత్రం 4.10 – 4.55 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. రాత్రికి అక్కడి గెస్ట్‌హౌస్‌లో సీఎం జగన్ బస చేయనున్నారు.
ఇది కూడా చదవండి: ఇడుపులపాయలో షర్మిల.. వేర్వేరు దారుల్లో అన్నా చెల్లెలు!