మండౌస్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. తుపాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. తుపాను ప్రభావంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు తుపాను ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ తెలిపారు. అదేవిధంగా అవసరమైన చోట పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement