Saturday, November 23, 2024

AP | మూడో రోజుకు చేరిన సీఎం జగన్ బస్సు యాత్ర..

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన బస్సుయాత్ర గురువారం రాత్రి నంద్యాల జిల్లాలో ముగించుకుని కర్నూలు జిల్లాకు చేరుకుంది. కర్నూలు జిల్లా పెంచికలపాడులో రాత్రి బస చేసిన జగన్ బస్సు యాత్ర శుక్రవారం ఉదయం అక్కడి నుంచి ప్రారంభించారు.

ఈ యాత్రలో భాగంగా పెంచకలపాడు నుంచి రామచంద్రాపురం, కోడుమూరు, హంద్రీ కైరవాడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డికి చేరుకుంటారు జ‌గ‌న్. రాళ్ల‌దొడ్డికి ముందు భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ సమీపంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం ఆరేకల్, ఆదోని క్రాస్, విరూపాపురం, బెనిగేరి, ఆస్పరి, చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా కేజీఎన్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఏర్పాటు చేసిన రాత్రి శిబిరానికి చేరుకుంటారని వైఎస్ ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement