ఆమదాలవలస (పొందూరు) : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో పాటు.. ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ వలంటీర్ వలనే పనిచేస్తున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పొందూరు మండలం ఉత్తమ సేవలందించిన వలంటీర్ లకు సత్కార సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పాలన అందుబాటులో లేదని వలంటీర్, సచివాలయ వ్యవస్థను సీఎం జగన్ నెలకోల్పోరని అన్నారు.
వలంటీర్లను విమర్శించిన నాయకులు కరోనా కాలంలో జూమ్ మీటింగ్ లో కనిపించెవారిని విమర్శించారు. పొందూరు మండలం పరిధిలోని అచ్చిపోలు, దల్ల, ధర్మపురం, గోకర్ణ పల్లి, గోరింట, కనిమెట్ట, కింతలి, కోటిపల్లి సచివాలయ పరిధిలోని వలంటీర్లకు సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలతో స్పీకర్ తమ్మినేని సత్కరించారు.