ప్రధాని మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. విద్యుత్ ధరలు, అదనపు ఇంధనంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ అనంతరం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని లేఖలో తెలిపారు. గత ఆరు నెలల్లో విద్యుత్ డిమాండ్ 15 శాతం పెరిగిందని వివరించారు. సెప్టెంబర్ లోనే విద్యుత్ డిమాండ్ 20 శాతానికి పైగా పెరిగిందన్నారు. కొన్నిసార్లు విద్యుత్ కొనుగోలు చేయాలంటే యూనిట్‌కు 20 రూపాయలు చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు. బొగ్గు కొరత వల్ల విద్యుత్ ప్లాంట్లు సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉందని ఆందోళవ వ్యక్తం చేశారు. ఏపీ జెన్ కో రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో 45 శాతం మేరకు తీర్చుగలుగుతోందన్నారు. బొగ్గు కొరత వల్ల ఏపీలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు సగం సామర్థ్యంతో పనిచేస్తున్నాయని సీఎం జగన్ లేఖలో వివరించారు.
ఇది కూడా చదవండి: ఇండ్లు లేని వారికి రూ.5 లక్షలు.. తెలంగాణలో కొత్త పథకం!