Saturday, November 23, 2024

CM JAGAN: నేటి నుంచే రంజాన్ మాసం ప్రారంభం.. ముస్లింపై అల్లా దయ ఉండాలన్న సీఎం

ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ మాసం నేటి నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా నెలవంక కనబడటంతో ఆదివారం నుంచి రంజాన్‌ నెల ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు నియమ, నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య రంజాన్‌ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదన్నారు. ఉపవాస దీక్షలు ఆచరించబోతున్న ప్రతి ఒక్కరికీ అల్లా దయతో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. మహనీయుడైన మహ్మద్‌ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్‌ ఆవిర్భవించింది రంజాన్‌ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని తెలిపారు. మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపు మాపేందుకు చేసే కఠోర దీక్షే రంజాన్‌ ఉపవాస దీక్ష అని సీఎం జగన్ చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement