Saturday, November 23, 2024

విశాఖ జిల్లాలో 20 వేల మందికి వాహన మిత్ర.. 15న పంపిణీ చేయనున్న సీఎం జగన్‌

విశాఖపట్నం, ప్రభన్యూస్‌: ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఈనెల 15న విశాఖ జిల్లాలో ఇరవై వేల మంది లబ్దిదారులు వాహన మిత్ర పథకంలో లబ్ధి పొందుతున్నారని రాష్ట్ర పరిశ్రమలూ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వెళ్లడించారు. రాష్ట్రంలో 2.61 లక్షల మందికి రూ.261 కోట్ల రూపాయలను వాహన మిత్ర పథకంగా పంపిణీ చేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ- ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో 15వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను మంత్రి అమర్నాథ్‌ సోమవారం పరిశీలించారు. సభ ఏర్పాట్లు- వివరాలను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. మల్లికార్జునను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి అమర్నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే మూడు విడతలుగా వాహన మిత్ర లబ్ధిదారులకు సుమారు 750 కోట్ల రూపాయలు అందజేశామని చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు చూసి ప్రతిపక్షాల నవ రంద్రాలు మూసుకుపోయాయని అని మంత్రి అమర్నాథ్‌ ఎద్దేవా చేశారు. ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన ప్లీనరీకి ఇంత పెద్ద ఎత్తున జనం వస్తారని యెవ్వరు ఊహించ లేదని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు టీ-డీపీని ఆక్రమించుకున్న తర్వాత 27 సంవత్సరాలలో ఇంత పెద్ద సభ ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలో నిర్వహించిన ప్లీనరీ కి హాజరైన జనంతో 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయిందని అయినా సభకు స్పందన లేదని టిడిపి నాయకులు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మంత్రి అమర్‌ నాథ్‌ వెంట మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, ఎమ్‌ ఎల్‌ సి వరుదు కళ్యాణి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ శీతంరాజు సుధాకర్‌, వి ఎమ్‌ ఆర్‌ డీ యే చైర్‌ పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల తదితరులు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement