Tuesday, November 26, 2024

శ్రీవారి సేవలో సీఎం.. జగన్ సమక్షంలో రైతు సాధికార సంస్థ‌తో ఒప్పందం

తిరుమల శ్రీవారిని సీఎం జగన్‌ దర్శించుకున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు మహా ద్వారం వద్ద టీటీడీ చైర్మన్, ఈఓలు స్వాగతం పలికారు. సీఎం జగన్‌ శ్రీవారి ధ్వజ స్తంభాన్ని నమస్కరిస్తూ ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి బియ్యంతో తులాభారం మొక్కులు సమర్పించారు. సీఎం జగన్‌కు అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్ధప్రసాదాలను అందచేశారు.

శ్రీవారి దర్శనం అనంతరం సీఎం జగన్‌.. శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌కు సంబంధించి.. కన్నడ, హిందీ చానళ్లను ప్రారంభించారు. తిరుమలలో రూ.10 కోట్లతో నూతనంగా నిర్మించిన బూందీపోటు భవనాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. తర్వాత అన్నమయ్య భవన్‌లో రైతు సాధికార సంస్థ, టీటీడీ మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్‌ సమక్షంలో టీటీడీ, రైతు సాధికార సంస్థ మధ్య ఎంవోయూ కుదిరింది. అనంతరం రెండు రోజుల తిరుమల పర్యటన ముగించుకొని రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లారు.

ఇది కూడా చదవండి: రాయచూర్ ను తెలంగాణలో కలిపేయాలి: బీజేపీ ఎమ్మెల్యే

Advertisement

తాజా వార్తలు

Advertisement