ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం ఉదయం విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దాదాపు 45 నిమిషాల పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.
కాగా, సెప్టెంబర్ 24వ తేదీన సీఎం జగన్ వ్యాయామం చేస్తూ గాయపడ్డారు. జిమ్ చేస్తుండగా ఆయన కాలు బెనకడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆ సమయంలో వైద్యులు సాధారణ ట్రీట్‌మెంట్ ఇవ్వగా జగన్ కోలుకున్నారు. అయితే తాజాగా అదే కాలికి మరోసారి వాపు రావడంతో జగన్ మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు. దీంతో జగన్ కాలికి వైద్యులు పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ఇది ప్రజాస్వామ్యమా… ఆటవిక రాజ్యమా?: సూర్యపేటలో జైభీమ్ ఘటనపై రేవంత్ ఫైర్
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily