Tuesday, November 19, 2024

AP : కుప్పంలో సీఎం జగన్ పర్యటన…హెచ్ఎన్ఎస్ఎస్ నీరు విడుదల

ఏపీ సీఎం జగన్ ఇవాళ కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం రాజుపేట్, రామకుప్పం మండలం హెలిప్యాడ్‌ చేరుకోనున్నారు. అనంతరం హెచ్ఎన్ఎస్ఎస్ నీరు విడుదల సందర్భంగా పూజలు చేసి హెచ్ ఎన్ ఎస్ ఎస్ నీరు విడుదల చేస్తారు.

- Advertisement -

అనంతరం శాంతిపురం మం, గుండిశెట్టిపల్లి వద్ద హెలిప్యాడ్‌కు చేరుకోనుని గుండిశెట్టి పల్లి వద్ద బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. సీఎం తన పర్యటనలో.. తాగు, సాగునీటి కోసం దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చనున్నారు. కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 4.02 లక్షల జనాభాకు త్రాగు నీరు అందిస్తూ.. అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ. 560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి, కుప్పం నియోజకవర్గానికి నేడు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు సీఎం జగన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement