ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత సీఎం జగన్ మొదటిసారిగా స్పందన కార్యక్రమం చేపట్టారు. ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణంతో పాటు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, జాతీయ రహదారులతో పాటు ఇతర మౌలిక వసతుల కోసం భూసేకరణ, జగనన్న భూహక్కు-భూ రక్ష, విద్య, వైద్య రంగాల్లో నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ అర్బన్, రూరల్ హెల్త్ క్లినిక్స్, ఆర్బీకేలపై సీఎం జగన్ సమీక్ష చేస్తారు. స్పందన కార్యక్రమంలో వస్తున్న ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను సీఎం జగన్ తెలుసుకుంటారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement