ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పరేడ్ ప్రదర్శనను సీఎం జగన్ తిలకించారు. వాహనంలో సీఎంతో పాటు సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో 12 కంటిజెంట్స్ పరేడ్ నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 10 బ్యాండ్స్ ప్రదర్శన చేయనున్నారు. మరోవైపు ప్రదర్శన కోసం వివిధ శాఖల శకటాలను అధికారులు సిద్ధం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement