Tuesday, November 19, 2024

మోదీకి మరో లేఖ రాయనున్న జగన్

ఏపీ సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. సుమారు మూడు గంటల పాటు ఈ మంత్రివర్గ సమావేశం జరిగింది. కరోనా నేపథ్యంలో పలు కీలక అంశాలపై చర్చించిన కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కరోనా వ్యాక్సినేషన్ పై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయాలని సీఎం జగన్ కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. వ్యాక్సిన్ డోసులు త్వరగా కేటాయించాలని ప్రధానిని కోరనున్నారు. 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ లో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, వ్యాక్సిన్ ల కోసం ఇప్పటికే పలు సార్లు సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖలు రాసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే రాష్ట్రానికి వ్యాక్సిన్ ల కొరత ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement