Saturday, November 23, 2024

CM Jagan: నేడు విశాఖకు సీఎం జగన్..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ విశాఖలో పర్యటిస్తున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ రోజు ఉదయం 10.15కు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విమానంలో బయలుదేరి 11 గంటలకు విశాఖ చేరుకుంటారు. రోడ్డు మార్గాన 11.30 గంటలకు శారదాపీఠం చేరుకుంటారు. ఒంటి గంట వరకు శారదా పీఠంలో జరిగే పూజా కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1.25కు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుని తిరుగు ప్రయాణం అవుతారు. సీఎం పర్యటన సందర్భంగా విశాఖలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా, జనవరి 11న ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వార్షిక వేడుకలకు సీఎం జగన్ ను ఆహ్వానించారు. పెందుర్తిలోని చిన్నముషిడివాడలో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠం యొక్క వార్షిక మహోత్సవంలో (వార్షిక వేడుక) హాజరయ్యేందుకు సీఎం జగన్ విశాఖపట్నం వెళ్లనున్నారు. వార్షిక వేడుకలు ఈ నెల 7న ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 11వ తేదీ వరకు జరుగుతాయి.

విశాఖ శ్రీ శారదా పీఠాన్ని స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి 1997లో స్థాపించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి విశాఖ శ్రీ శారదా పీఠంతో చాలా కాలంగా అనుబంధం ఉంది. పీఠాధిపతి రాజా శ్యామలా దేవి మరియు ప్రధాన పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు పొందేందుకు ఆయన తరచుగా పీఠాన్ని సందర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement