సీఎం వైఎస్ జగన్ నేడు దుర్గమ్మను దర్శించుకోనున్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజైన ఇవాళ సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు. మంగళవారం మూలా నక్షత్రం కావడంతో సుమారు లక్షమంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం వైఎస్ జగన్ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకోనున్నారు. రాష్ట్రప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, కుంకుమలను అమ్మవారికి సమర్పించనున్నారు. అమ్మవారికి సంబంధించి ఆగ్‌మెంట్ రియాల్టీ షోను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా మధ్యాహ్నం 2 గంటల వరకు కనకదుర్గ ఫ్లైఓవర్‌పై ఆంక్షలు కొనసాగనున్నాయి.
ఇది కూడా చదవండి: కరోనా ఇంకా పోలేదు.. జాగ్రత్తలు పాటించండి: తెలంగాణ ఆరోగ్యశాఖ