‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ పథకం కింద రాష్ట్రంలో 50.58 లక్షల మంది రైతులకు..1036 కోట్లను సీఎం జగన్ రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు.
కాగా, రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏటా ప్రభుత్వం.. రూ. 13వేల 500 అందిస్తోంది. తొలివిడతగా పంట వేసేముందు మే నెలలో 7వేల500, రెండో విడతగా అక్టోబరులోపు రూ. 4వేలు, మూడో విడుతగా సంక్రాంతికి రూ. 2వేలు ఇస్తోంది. ప్రస్తుతం విడుదల చేస్తున్న మొత్తంతో కలిపి రూ. 19,813 కోట్ల సాయాన్ని రైతులకు అందిస్తోంది.