ఏపీలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం నేడు ప్రారంభం కానుంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో లాంఛనంగా రిజిస్ట్రేషన్ పట్టాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందజేయనున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఇప్పటికే లబ్దిపొందిన వారికి నేటి నుంచి రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేస్తారు. గతంలో ఉన్న నివసించే హక్కు స్ధానంలో, దాదాపు 52 లక్షల మందికి సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్ చేస్తారు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఇప్పటికే లబ్దిపొందిన 8.26 లక్షల మందికి నేటి నుంచి రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేయనున్నారు. ఈ పథకం క్రింద దాదాపు రూ. 10,000 కోట్ల రుణమాఫీతో పాటు రూ. 6,000 కోట్ల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీల మినహాయింపుతో దాదాపు రూ. 16,000 కోట్ల లబ్ది చేకూరనుంది.
ఈ పథకం పూర్తిగా స్వచ్ఛందం
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు పేదలకు ప్రభుత్వాలు కేవలం నివసించే హక్కులు మాత్రమే ఇస్తున్న పరిస్ధితుల్ని మారుస్తూ…ఈ రోజు మీ ఇంటి విలువ రూ. 2 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు ఉన్నప్పటికీ మీ ఇల్లు మరియు మీ ఇంటి స్ధలాన్ని మీకు అమ్ముకునే స్వేచ్ఛ కూడా లేక ఆ ఆస్తి మీద సర్వహక్కులు పొందలేని దుస్ధితిని తొలగిస్తూ…కేవలం నామమాత్రపు రుసుముతో జగన్ ప్రభుత్వం.. మీ రుణాలు, మీ వడ్డీలు అన్నీ మాఫీ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ కూడా ఉచితంగా చేయిస్తూ మీ ఇంటిపై మీకు పూర్తి హక్కులు ఇస్తున్న శుభవేళ ఇది.
గత ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య ఐదేళ్ళలో అధికారులు 5 సార్లు వడ్డీ మాఫీ ప్రతిపాదనలు పంపినా.. వడ్డీ కూడా మాఫీ చేయలేదు. అయితే 43 వేల మంది లబ్ధిదారులు వారి అసలు,వడ్డీ కలిపి రూ. 15.29 కోట్లు చెల్లించినప్పటికీ ఎలాంటి యాజమాన్య హక్కులు పొందలేదు. వారికి కూడా నేడు ఉచితంగా సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital