Thursday, November 21, 2024

ఢిల్లీకి ఏపీ సీఎం.. నేడు ప్రధాని మోదీతో జగన్ భేటీ

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుంచి ఢిల్లీకి బయల్దేరనున్నారు. సాయంత్రం 4.గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాల పరిష్కారంపై అభ్యర్థించనున్నారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రధానిని సీఎం కోరనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలను ఆమోదించాలని విజ్ఞప్తి చేయనున్నారు. తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న జల వివాదాలపైనా ప్రధానితో సీఎం చర్చించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ బోర్డులకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతున్నా… రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు పూర్తి సానుకూలత వ్యక్తం చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను అప్పగిస్తే తామూ అప్పగిస్తామని స్పష్టం చేసింది. కేఆర్​ఎంబీ, జీఆర్​ఎంబీలకు సాగునీటి ప్రాజెక్టులను అప్పగించే విషయంపైనా ప్రధానితో సీఎం చర్చించే అవకాశాలున్నాయి. మూడు రాజధానుల అంశం సహా అమరావతి అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికల పైనా చర్చించే అవకాశాలున్నాయి.

మరోవైపు కేంద్ర ఆర్ధిక శాఖ, ఏవియేషన్ మంత్రులతోనూ సీఎం జగన్ సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుబాటులో ఉన్న పలువురు ఇతర కేంద్ర మంత్రులతోనూ సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement