Saturday, November 23, 2024

టెన్త్ పరీక్షలు రద్దు? కరోనాపై జగన్ కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ లో పదవతరగతి పరీక్షలను రద్దు చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కరోనా మహమ్మారి అంతకంతకు విజృభిస్తుండంతో ప్రభుత్వం పరీక్షల రద్దు దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. కోవిడ్ ఫై సోమవారం ముఖ్యమంత్రి జగన్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో పదవ తరగతి పరీక్షల రద్దు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల వాయిదాపై చర్చించి తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని అధికార పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇంటర్ ప్రధమ సంవత్సర పరీక్షలను కూడా రద్దు చేయనున్నట్టు సమాచారం. పీజీ నీట్ జేఈఈ అడ్వాన్సుడ్ తదితర జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలు ఇతర రాష్ట్రాల పరీక్షలు వాయిదా పడడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేందుకు సమాయత్తమైంది. ఎంసెట్ ఇతర పరీక్షల నిర్వహణపై కూడా నేటి సమావేశంలో చర్చించే అవకాశం వుంది. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో స్కూళ్లు మూతపడ్డాయి. టెన్త్, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు కూడా రద్దయ్యాయి. మరికొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోనూ స్కూళ్ల మూసివేత, టెన్త్, ఇంటర్ పరీక్షలపైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించే అంశంపైనా అధికారులతో చర్చించనున్నారు.

నైట్ కర్ఫ్యూతో పాటు పగటి వేళల్లోనూ కోవిడ్ నిబంధనలను మరింత కఠినతరం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అన్ని రకాల ప్రార్థనాలయాల్లో ఆంక్షలు విధించనున్నట్లు సమాచారం. బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, పబ్లిక్ పార్క్‌లపై ముంబై, ఢిల్లీ తరహా ఆంక్షలు అమలు చేసే ఛాన్స్ ఉంది. పెళ్లిళ్లు, అంతక్రియలకు పరిమిత సంఖ్యలోనే జనాలను అనుమతించవచ్చు. సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వకూడదని భావిస్తున్నారు. అంతేకాదు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసే అంశంపై అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. వాలంటీర్లతో ఇంటింటి సర్వే చేయించే అవకాశముందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement