Thursday, November 7, 2024

పోలవరం పనులు ఆలస్యం కావడానికి వీళ్లేదు: సీఎం జగన్

ఏపీలో ఇరిగేషన్‌పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కేంద్రం నుంచి పోలవరానికి రావల్సిన బిల్లుల చెల్లింపుపై సీఎం జగన్ ఆరా తీశారు. దాదాపు రూ.1600 కోట్ల బిల్లులు వేర్వేరు దశల్లో పెండింగ్‌లో ఉన్నాయన్న సీఎం పేర్కొన్నారు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తిచేయాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుగా డబ్బులు ఇస్తున్నట్లు తెలిపారు సీఎం జగన్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసిన ఖర్చుకు సంబంధించి కేంద్రంలో బిల్లులు పెండింగులో ఉండడం సరికాదని అన్నారు. అధికారులు వెంటనే దీనిపై దృష్టిపెట్టాలి..చేసిన ఖర్చు వెంటనే రీయింబర్స్‌ అయ్యేలా చూడాలని సీఎం సూచించారు. ఇక పోలవరం ప్రాజెక్టు పనుల వివరాలను సీఎంకు వివరించారు అధికారులు.

ఇక వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం. ఇప్పటికే చర్చలకు ఆడిశా సీఎస్‌కు లేఖరాశామని, వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నామన్నారు సీఎస్‌. దీనిపై త్వరలోనే నేరడి బ్యారేజీకి సంబంధించి ఒడిశాతో మాట్లాడతామని సీఎస్‌ తెలిపారు. నెల్లూరు బ్యారేజీ నిర్మాణం జులై 31 నాటికి పూర్తవుతాయని వెల్లడించిన అధికారులు. సంగం బ్యారేజీ పనులు 84శాతం పనులు పూర్తయ్యాయని, జులై 31 నాటికి పనులు పూర్తవుతాయని వెల్లడించారు అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement