కరోనా బారినపడిన ప్రకాశం జిల్లా కారంచేడుకు చెందిన ప్రభుత్వ వైద్యుడు భాస్కరరావు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సి ఉండగా, రూ.1.5 కోట్లు ఖర్చవుతుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే సీఎం జగన్ ఉదారంగా స్పందించి, ఆ మొత్తాన్ని ప్రభుత్వ సాయం రూపంలో విడుదల చేశారు. ఈ విషయాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
భాస్కరరావుకు ఊపిరితిత్తుల మార్పిడికి ఒక కోటి 50 లక్షల రూపాయలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారని, దాంతో సీఎం జగన్ ను రూ.1 కోటి అడిగామని బాలినేని తెలిపారు. అయితే, సీఎం జగన్ పెద్దమనసుతో కోటి కాదు, ఖర్చెంతైనా ఫర్వాలేదు, మనమే ఇద్దాం అని చెప్పారని తెలిపారు. ఆ మేరకు రూ.1.5 కోట్లు విడుదల చేశారని బాలినేని వివరించారు. ఓ వైద్యుడి ప్రాణం కోసం ఒకటిన్న కోట్ల రూపాయలు విడుదల చేయడం మామూలు విషయం కాదని, సీఎం జగన్ ఎంతో చొరవ చూపి డాక్టర్ భాస్కరరావు చికిత్సకు నిధులు విడుదల చేశారని కొనియాడారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీకి సీఎం జగన్.. పర్యటన వెనుక ఉన్న మతలబ్ ఏంటి?