శ్రీకాకుళంలోని కేఆర్ స్టేడియంలో ఈరోజు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడో దశ అమ్మఒడి ఫండ్స్ ను విడుదల చేశారు. బహిరంగ సభ ముగిసిన అనంతరం ల్యాప్‌టాప్‌లోని డిజిటల్ కీని నొక్కి ఆన్‌లైన్ విధానంలో సీఎం ఆ మొత్తాన్ని విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 43,96,402 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.6,595 కోట్లు జమ చేయబడ్డాయి, దీంతో 80 లక్షల మంది పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే పిల్లలకు ప్రయోజనం కలగనుంది.
బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూ.12,000/- విలువైన ట్యాబ్‌లను ఈ విద్యా సంవత్సరం నుండి VIII తరగతిలో ప్రవేశించిన విద్యార్థులకు ఇవ్కడం జరుగుతుంది అని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.